Monday, March 9, 2026
E-PAPER
Homeకరీంనగర్ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో రైస్ మిల్లర్లు

ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో రైస్ మిల్లర్లు

- Advertisement -

కలెక్టరేట్ ముందు రైస్ మిల్లర్ల మౌన ప్రదర్శన
నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైస్ మిల్లర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారని, రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని రైస్ మిల్లర్లు అసోసియేషన్ అధ్యక్షులు పబ్బ నాగరాజు అన్నారు. కలెక్టరేట్ ముందు జరిగిన మౌన ప్రదర్శన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లులు గత కొన్ని సంవత్సరాలుగా నష్టాలు ఊబిలో నడుస్తున్నాయని అనేక రైస్ మిల్లులు ఇప్పటికే డిఫాల్టర్లుగా ఉన్నాయని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఒక డిఫాల్ట్ రైస్ మిల్ యజమాని తణుకు స్వప్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని అదే రీతిలో మిగతా డిఫాల్ట్ రైస్ మిల్లర్ల పరిస్థితి ఉందని ఆయన అన్నారు.

రైస్ మిల్లులు నష్టాల బాటలో కొనసాగుతున్నాయని,అధిక విద్యుత్ చార్జీలు, ధాన్యం ఇచ్చినంత త్వరగా బియ్యం తీసుకోకపోవడం ,దాన్యం తరుగు అవడం, డామేజ్ అవ్వడం ధాన్యంలో నాణ్యత లేక అధిక నూకలు అవడం ఇలా అనేక కారణాల చేత రైస్ మిల్ ఇండస్ట్రీ నష్టాల బాటలో నడుస్తున్నదనీ ఈ కారణాలతో పాటు కొంతమంది మిల్లర్ల అశ్రద్ధ అవగాహన లేకపోవడం మూలంగా నష్టాల పాలై డిఫాల్ట్ మిల్లర్లుగా మిగిలిపోతున్నారనీ ఆయన అన్నారు.ప్రభుత్వంలో భాగమై ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ ఉన్న ఇండస్ట్రీ  నష్టాల ఊబిలో చిక్కుకుందనీ, అంతేకాకుండా ఇప్పటివరకు మిల్లర్లకు ప్రభుత్వం నుంచి రావలసిన మిల్లింగ్ ట్రాన్స్పోర్ట్ డ్రై ఏజ్ కస్టూడియన్ చార్జీలు గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయాయని,  చార్జీలు ఇప్పించి, డిఫాల్ట్ మిల్లర్లకు విధించిన 25% పెనాల్టీని 12 % వడ్డీని మాఫీ చేపించి ప్రభుత్వానికి బాకీ ఉన్నటువంటి బియ్యం నాలుగు విడతలుగా అందించడానికి అనుమతులు ఇప్పించాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -