నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల పాత్ర సమాజ అభివృద్ధిలో ఎంతో కీలకమని నాయకులు తెలిపారు. మహిళల సాధికారత, విద్య, ఆరోగ్యం మరియు స్వయం ఉపాధిపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, విడిసి అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ వినోద్ గౌడ్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ శ్యామ్, ఐకెపి సీసీ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, ఇందిరమ్మ కమిటీ మహిళా సభ్యులు, ఐకెపి అధ్యక్షురాళ్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పారిశుధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


