Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పది విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్స్ పంపిణీ

పది విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్స్ పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ విట్ఠల్ పరీక్ష ఫ్యాడ్స్ సామగ్రిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పదో తరగతిలో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించాలని ఆయన కోరారు. కష్ట పడి చదువుతోనే ప్రతి వ్యక్తి జీవితంలో మార్పు సాధ్యమవుతుందని ప్రతి విద్యార్థి నేటి నుంచి ఉన్నత ఆశయాన్నినిర్దేశించుకోవాలన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నిఅలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.డిజిటల్ కంటెంట్ ద్వారా విద్య మరింత సులభంగా సమగ్రంగా అర్థమవుతుందనని ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తర్ణిత సాధించి తల్లిదండ్రులతో పాటు ఉపాద్యాయులకు మంచి పేరు తెచ్చుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమల ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి,రవి,రాజు,నాగనాథ్,సర్పంచ్ తిర్మల్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ విట్ఠల్, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -