తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌లో ఈటీవి విన్ సత్తా చాటింది. ఈవిన్ నిర్మించిన చిత్రాలు ఏడు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నాయి.
బెస్ట్ ఫిలిం ‘రాజు వెడ్స్ రాంబాయ్’, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ‘అనగనగా’, సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ‘మౌనమే నీ భాష’, బెస్ట్ డైరెక్టర్ సాయిలు కంపాటి (రాజు వెడ్స్ రాంబాయి), బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ – సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్) బెస్ట్ మేల్ యాక్టర్ చైతు జొన్నలగడ్డ (రాజు రాంబాయి) ఉత్తమ నేపథ్య గాయకుడు అనురాగ్ కులకర్ణి (రాజు రాంబాయి)కు అవార్డులు దక్కాయి. ఈ సందర్భం ఈటీవీ విన్ మేకర్స్ విజేతలతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ, ‘ఈ వేడుక చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. యువతదే రాజ్యం అని నిరూపించిన సందర్భం ఇది. యువతరానికి నా సెల్యూట్. వీళ్ళని గుర్తించి గౌరవించిన జ్యూరీకి సెల్యూట్. ఈ సంవత్సరం అవార్డులన్నీ నిజంగా అర్హులకే ఇచ్చారనిపించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హదయపూర్వక ధన్యవాదాలు. రామోజీరావు మహానుభావుడు. ఆయన దిక్సూచి, కాలజ్ఞాని. ఆయన చేసిన ప్రతిదీ సక్సెస్. ఆయన ఏదైతే ఆశించి ఈటీవీ విన్‌ని స్థాపించారో, ఆ ఉద్దేశం ఈరోజు నెరవేరుతోంది. గొప్ప సినిమాలు రావాలి, కొత్త ప్రతిభ రావాలని ఆయన కన్న కలలని సాకారం చేస్తూ ఈటీవీ విన్ ముందుకు సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా అయితే గద్దర్ పేరు మీద అవార్డులు ప్రకటించి సినిమా పరిశ్రమని గుర్తించి, గౌరవిస్తుందో అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ఉనికిని చాటి చెప్పేలా దయచేసి నంది అవార్డులు ప్రకటించాలని సవినయంగా కోరుతున్నాను’ అని తెలిపారు.
రామోజీరావు విజన్‌ని ఈటీవీ విన్ అద్భుతంగా కొనసాగిస్తోంది
- Advertisement -
- Advertisement -



