- Advertisement -
హైదరాబాద్ : ఉత్సాహంగా సాగిన తెలంగాణ మహిళల రగ్బీ లీగ్ సీజన్2 ఘనంగా ముగిసింది. మహిళల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన టోర్నమెంట్‌లో 12 జట్లు పోటీపడగా.. బ్లాక్ ఆర్చర్స్ రగ్బీ క్లబ్ చాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో హైదరాబాద్‌పై 10-7తో బ్లాక్ ఆర్చర్స్ రగ్బీ క్లబ్ ఘన విజయం సాధించింది. బ్లాక్ ఆర్చర్స్ క్రీడాకారిణి బానుతు శిరీష 7 ట్రైల్ సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచింది. తెలంగాణ రగ్బీ సంఘం అధ్యక్షుడు నరేంద్ర రామ్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
- Advertisement -



