Tuesday, March 10, 2026
E-PAPER
Homeజాతీయందేశ సమాఖ్య స్వభావాన్ని కేంద్రం నాశనం చేస్తోంది

దేశ సమాఖ్య స్వభావాన్ని కేంద్రం నాశనం చేస్తోంది

- Advertisement -

రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు : కార్మిక, రైతు పార్లమెంట్‌లో నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

మోడీ ప్రభుత్వం దేశ సమాఖ్య స్వభావాన్ని నాశనం చేస్తోందని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని కార్మిక, రైతు పార్లమెంట్‌ పేర్కొంది. సోమవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌లో కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా సంయుక్తంగా కార్మిక, రైతు పార్లమెంటును చేపట్టాయి. ఈ సందర్భంగా కార్మిక, రైతు పార్లమెంట్‌ను ఉద్దేశించి కార్మిక సంఘాల నేతలు సుదీప్‌ దత్తా (సీఐటీయూ), అమర్జీత్‌ కౌర్‌ (ఏఐటీయూసీి), అశోక్‌ సింగ్‌ (ఐఎన్టీయూసీ), హెచ్‌సి త్యాగి (హెచ్‌ఎంఎస్‌), రాజేందర్‌ సింగ్‌ (ఏఐయూటీయూసీ), లతా (సేవా), రాజీవ్‌ దిమ్రి (ఏఐసీసీటీయూ), శత్రుజీత్‌ (యూటీయూసీ), ఎస్‌ కెఎం నేతలు అశోక్‌ ధావలే (ఎఐకేఎస్‌), రావుల వెంకయ్య (ఎఐకేఎస్‌ అజరు భవన్‌), యుధ్వీర్‌ సింగ్‌ (బికేయూ), సత్యవాన్‌ (ఎఐకేకేఎంఎస్‌), ఆశిష్‌ మిట్టల్‌ (ఎఐకేఎంఎస్‌), శశికాంత్‌ (కేకేయూ), డాక్టర్‌ సునీలం (కెఎస్‌ఎస్‌), పురుషోత్తం శర్మ (ఎఐకేఎం), జోగిందర్‌ నైన్‌ (బీకేయూ), మనీష్‌ భారత్‌ (జేకేఏ), కర్నైల్‌ సింగ్‌ ఇకోలాహా (ఎఐసీకేఎస్‌) తదితరులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాలను కుంగదీస్తోందని, అధికార కేంద్రీకృతానికి చర్యలు చేపడుతోందని విమర్శిం చారు. రాష్ట్రాల పన్ను హక్కులను పునరుద్ధరించడానికి జీఎస్టీ చట్టాన్ని సవరి ంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాలకు ఇచ్చే 33శాతం పన్ను వాటాను 60 శాతంగా పెంచాలని కూడా డిమాండ్‌ చేశారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయి ల్‌ దాడిని కార్మిక, రైతు నేతలు ఖండించారు. భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్‌ అమరవీరుల వార్షికోత్సవమైన మార్చి 23ను సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఏప్రిల్‌ 1న కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా అఖిల భారత బ్లాక్‌ డేగా పాటించాలని నిర్ణయించారు. మోడీ ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అన్ని రాష్ట్రాల్లో మహా పంచాయితీలు నిర్వహించనున్నట్టు పార్లమెంట్‌ ప్రకటించింది. ఫిబ్రవరి 12న జరిగిన జాతీయ సమ్మెను చారిత్రా త్మక విజయంగా మార్చిన వారందరికీ పార్లమెంటు వందనం చేసింది. కార్మిక సంఘాల నేతలు ఎఆర్‌ సింధు (సీఐటీయూ), ముఖేష్‌ కశ్యప్‌ (ఏఐటీయూసీి), షహనాజ్‌ రఫీక్‌ (ఐఎన్టీయూసీ), నారాయణ్‌ సింగ్‌ (హెచ్‌ఎంఎస్‌), ఆర్‌కె శర్మ (ఏఐయూటీయూసీి), లతా (సేవా), రాఘవ్‌ సింగ్‌ (ఏఐసీసీటీయూ), గజరాజ్‌ సింగ్‌ (యూటీయూసీ), ఎస్‌ కెఎం నేతలు పి. కృష్ణప్రసాద్‌ (ఎఐకేఎస్‌), రాజన్‌ క్షీరసాగర్‌ (ఎఐకేఎస్‌ అజరు భవన్‌), యుధ్వీర్‌ సింగ్‌ (బికేయూ), హన్సరాజ్‌ రాణా (ఎఐకేకేఎంఎస్‌), ధరంపాల్‌ సింగ్‌ (ఎఐకేఎంఎస్‌), సతీష్‌ ఆజాద్‌ (కేకేయూ), ప్రేమ్‌ సింగ్‌ గెహ్లావత్‌ (ఎఐకేఎం), జోగీందర్‌ సింగ్‌ నైన్‌ (బీకేయూ), సునీల్‌ (టీకేఎస్‌)లు అధ్యక్ష వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -