Tuesday, March 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశాసనసభలో ఏ చర్చకైనా సిద్ధం : మంత్రి పొంగులేటి

శాసనసభలో ఏ చర్చకైనా సిద్ధం : మంత్రి పొంగులేటి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఈనెల 16నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కేసీఆర్‌తో సహా బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులందరూ హాజరుకావాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో అడిగే ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సోమవారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో మంత్రి మాట్లాడుతూ కానీ, ప్రతిపక్షం ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వారి సొంత ఎజెండాతో సభకు వస్తున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని ఇండ్ల నిర్వాసితులందరికీ ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ విషయంపై సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారనీ, దాని ప్రకారం త్వరలో అక్కడి అర్హులందరికీ ఇంటి పట్టాతోపాటు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ పేదవాడి పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు. ఓఆర్‌ఆర్‌ పక్కనున్న నాదేనంటూ బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నదనీ, దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని హితవు పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -