– 279 అంతర్జాతీయ విమానాలు రద్దు
– ఇండియన్ ఎయిర్‌లైన్స్ నిర్ణయం
– నేటి నుంచి 78 అదనపు విమానాలు నడపనున్న ఎయిరిండియా
న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న కారణంగా వాటి ప్రభావం విమాన సర్వీసులపై పడుతోంది. గల్ఫ్ ప్రాంతంలో గగనతల ఆంక్షలు విధించడంతో భారత ఎయిర్‌లైన్స్ ఆదివారం పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్ని భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా పలు మార్గాల్లో విమాన సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. వివరాళ్లోకెళ్తే… ఆదివారం ఇండియన్ ఎయిర్‌లైన్స్ 279 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ను రద్దు చేసింది. అయితే అదే రోజు గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు రావాల్సిన 49 విమానాలను పరిస్థితులను బట్టి నడపాలని నిర్ణయించింది. దుబాయ్, అబూదాబీ, రాస్ అల్ ఖైమా, ఫుజైరా, మస్కట్, జెడ్డా వంటి నగరాల నుంచి ఈ విమానాలు రావాల్సి ఉంది. మార్చి 7న గల్ఫ్ ప్రాంతం నుంచి భారత్‌కు వచ్చిన 51 విమానాలు 8175 మంది ప్రయాణికులను తీసుకొచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన అంతరాయాలను తగ్గించేందుకు మార్చి 10 నుంచి 18 వరకు తొమ్మిది అంతర్జాతీయ మార్గాల్లో ఎయిరిండియా 78 అదనపు విమానాలను నడపనున్నట్టు ప్రకటించింది. కాగా పరిస్థితిని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దగ్గరగా పర్యవేక్షిస్తోంది. టికెట్ ధరలు పెరగకుండా నిఘా ఉంచుతోంది.
వార్ ఎఫెక్ట్
- Advertisement -
- Advertisement -



