Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేసిన సర్పంచ్

విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – రాజోలి
రాజోలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో సోమవారం రోజు  రాజోలి గ్రామ సర్పంచ్ గంగారెడ్డి చేతులమీదుగా విద్యార్థులకు పదో తరగతి హాల్ టికెట్లు పంపిణి చేశారు. ఈ సమావేశంలో సర్పంచ్ గంగారెడ్డి  మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షలు మంచిగా రాసి మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. అనంరతరం ఎంఈఓ భగీరథ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యాపరంగా విద్య అవసరాల పరంగా పరీక్షల సమయంలో ఎల్లప్పుడూ ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా చూసుకుంటామన్నారు. అలాగే పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒకేషనల్ ల్యాబ్ ను సర్పంచ్, ఉపసర్పంచ్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు. సర్పంచ్ గంగారెడ్డి, ఉపసర్పంచ్ సంధ్య శ్రీరామ్ లను ఎంఈఓ భగీరథ రెడ్డి సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -