నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని లింగంపల్లి గ్రామం లో మంగళవారం ప్రజా పాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా జరుగుతున్న పనులను మండల అభివృద్ధి అధికారి మానే ఉమాదేవి పరిశీలింఛారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ..పరిశుభ్రత, పారిశుధ్యం, సంస్థాగత నిర్వహణ, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని తెలిపారు. పరిపాలనా సామర్థ్యంపై రాష్ట్రవ్యాప్త ప్రత్యేక డ్రైవ్ సూచనల ఆధారంగా పనులు జరుగుతున్నాయని అన్నారు.
వివిధ కార్యక్రమాల గురించి అట్టడుగు స్థాయిలో అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజా పలాన ప్రగతి ప్రాణాలిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని అమలు జరుగుతుందని తెలిపారు. పేరుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపు ప్రక్రియ వేగంగా జరుగుతుందని అన్నారు. అన్ని కాలువలలోని అడ్డంకి పదార్థాలను తొలగించడానికి కాలువలను డీసిల్టింగ్ చేయడంజజరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ నల్ల మెట్టి లక్ష్మమ్మ-హనుమంతు యాదవ్, ఉప సర్పంచ్ శంకర్, వార్డు మెంబర్లు రాగంకోటయ్య, నడ్డి వెంకటమ్మ, పగడాల రేణుక, కిలారీ కోటయ్య, ప్రేమలత, శ్రావణి, కోటయ్య గ్రామస్తులు వున్నారు.



