నవతెలంగాణ – హైదరాబాద్: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారీ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ‘కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు-2025’ ప్రధానోత్సవ వేదికపై ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదంగా మారింది. దివంగత నటుడు కాంతారావు గొప్పదనాన్ని వివరించే క్రమంలో, తమిళ ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పట్ల ఆయన వాడిన పదజాలం తీవ్ర అభ్యంతరకరంగా ఉందనే విమర్శలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. కాంతారావు గారి జానపద చిత్రాలను చూసి ఎంజీఆర్ భయపడి ‘ఉచ్చ పోసుకునేవాడు’ అంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ఆ కాలంలో కాంతారావు నటనను చూసి ఎంజీఆర్ వణికిపోయేవాడని, ఎవడ్రా వీడు ఇండియన్ సినిమాలను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు అని భయపడేవాడంటూ రాజేంద్ర ప్రసాద్ అగౌరవంగా మాట్లాడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోసారి నోరు జారిన రాజేంద్ర ప్రసాద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



