నవతెలంగాణ-హైదరాబాద్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. దీంతో పాటు అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ ఐదో బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కివీస్ 102/5తో కష్టాల్లో ఉంది. ఆ సమయంలో బంతిని అందుకున్న అర్ష్‌దీప్, బ్యాట్స్‌మన్ డారిల్ మిచెల్ పైకి అనుచితంగా, ప్రమాదకరంగా విసిరాడు. ఇది ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించడమేనని మ్యాచ్ రిఫరీ నిర్ధారించారు. గత 24 నెలల కాలంలో అర్ష్‌దీప్‌కు ఇది తొలి తప్పిదం.
పేసర్ అర్షదీప్ సింగ్‌కు ఐసీసీ జరిమానా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



