Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కంఠాలి బస్టాండ్ ను శుభ్రపరిచిన సర్పంచ్

కంఠాలి బస్టాండ్ ను శుభ్రపరిచిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని కంఠాలి గ్రామంలోని రోడ్లు భవనాల శాఖ రోడ్డు మార్గం వరకు గ్రామస్తులు సహకారంతో గ్రామ సర్పంచ్ నాగనాథ్, ఉప సర్పంచ్ ప్రజా పాలనలో భాగంగా బస్టాండు పరిసర ప్రాంతాలను శుభ్రపరచడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ నాగనాథ్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా బస్టాండ్ ప్రాంతం చుట్టుపక్కల పిచ్చి మొక్కలతో పెరిగి ప్రయాణికులకు కూర్చోవడానికి వీలు లేకుండా ఉంది. ప్రస్తుతము ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా నీడను ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో బస్టాండు ఆవరణలో పెరిగిన మొక్కలను ముళ్ళపదలను తొలగించి పరిశుభ్రపరచడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ గ్రామ పెద్దలు మురళి పాటిల్, గ్రామ యువకులు ,మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -