- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా మంచి ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుడ్లు, పాలు, ఇతర సరకుల సరఫరాలో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు.
- Advertisement -



