Thursday, July 16, 2026
E-PAPER
Homeఆటలుఆగస్టు 30న హైదరాబాద్‌ మారథాన్‌

ఆగస్టు 30న హైదరాబాద్‌ మారథాన్‌

- Advertisement -

టీ షర్ట్‌, మెడల్స్‌ ఆవిష్కరించిన నిఖత్‌ జరీన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
హైదరాబాద్‌ రన్నర్స్‌ సోసైటీ, ఎన్‌ఎండీసీ, ఐడిఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌, తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న 15వ హైదరాబాద్‌ మారథాన్‌ ఆగస్టు 29, 30న జరుగనుంది. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ లేబుల్‌ రేసుగా గుర్తింపు పొందిన ఈ పోటీల్లో మారథాన్‌, హాఫ్‌ మారథాన్‌ సహా 10కె, 5కె విభాగాల్లో సుమారు 32 వేల మంది రన్నర్లు పాల్గొంటారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత స్టార్‌ బాక్సర్‌, రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ మారథాన్‌ జెర్సీ, మెడల్స్‌ను ఆవిష్కరించింది. ‘ పరుగు కేవలం ఓ వ్యాయామే కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి. కాపాడటంలో పరుగుదే పెద్ద పాత్ర. ప్రతి ఒక్కరు పరుగును జీవనశైలిలో భాగంగా అలవర్చుకోవాలని’ నిఖత్‌ జరీన్‌ వ్యాఖ్యానించింది. ఈ ఏడాది మారథాన్‌ విజేతలకు రూ.45 లక్షల నగదు బహుమతి దక్కనుండగా.. మారథాన్‌ నిర్వహణతో రూ.4 కోట్లు సేకరించి దాతృత్వ కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ కృష్ణ కుమార్‌, ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌ సీఎంవో శ్రీపాద్‌ షిండే, మారథాన్‌ రేసు డైరెక్టర్‌ రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.: హైదరాబాద్‌ రన్నర్స్‌ సోసైటీ, ఎన్‌ఎండీసీ, ఐడిఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌, తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న 15వ హైదరాబాద్‌ మారథాన్‌ ఆగస్టు 29, 30న జరుగనుంది.

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ లేబుల్‌ రేసుగా గుర్తింపు పొందిన ఈ పోటీల్లో మారథాన్‌, హాఫ్‌ మారథాన్‌ సహా 10కె, 5కె విభాగాల్లో సుమారు 32 వేల మంది రన్నర్లు పాల్గొంటారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత స్టార్‌ బాక్సర్‌, రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ మారథాన్‌ జెర్సీ, మెడల్స్‌ను ఆవిష్కరించింది. ‘ పరుగు కేవలం ఓ వ్యాయామే కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి. కాపాడటంలో పరుగుదే పెద్ద పాత్ర. ప్రతి ఒక్కరు పరుగును జీవనశైలిలో భాగంగా అలవర్చుకోవాలని’ నిఖత్‌ జరీన్‌ వ్యాఖ్యానించింది. ఈ ఏడాది మారథాన్‌ విజేతలకు రూ.45 లక్షల నగదు బహుమతి దక్కనుండగా.. మారథాన్‌ నిర్వహణతో రూ.4 కోట్లు సేకరించి దాతృత్వ కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ కృష్ణ కుమార్‌, ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌ సీఎంవో శ్రీపాద్‌ షిండే, మారథాన్‌ రేసు డైరెక్టర్‌ రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -