నిధులు వచ్చిన నిర్లక్ష్యం ఎందుకు
నవతెలంగాణ – మిడ్జిల్
మండలంలోని వాడ్యాల్ గ్రామంలో రచ్చకట్ట నుండి బిసి, దళితుల కాలనీకి వెళ్లే రహదారి మూలమలుపు దగ్గర సిసి రోడ్డు కృంగిపోవడంతో వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్న కూడా పంచాయతీ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పంచాయతీలు కాలేయ పని తప్ప గ్రామ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులకు పాలకులకు సమస్యలపై విన్నవించిన పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు. కాగితాలోని గ్రామాభివృద్ధి తప్ప ప్రగతిలో కనిపించడం లేదని విమర్శలు వినబడుతున్నాయి. మండల శాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోరా.?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



