నవతెలంగాణ-హైదరాబాద్: సామాన్య ప్రజలు ఇంకా ఎన్నిరోజలు అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, గ్యాస్ సిలిండర్ల్ ధరల పెరుగుదలను బరాయించాలని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామని, కానీ మోడీ సర్కార్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు.
ప్రజలు ఎంతవరకు సహిస్తారు? ధరలు పెరిగాయి, నిరుద్యోగం పెరిగింది, LPG పరిస్థితిని చూడండి, కేవలం వారి(బీజేపీ) విధానాలు, పథకాల వల్లనే. పార్లమెంటులో చర్చ జరిగి ఉంటే బాగుండేది, కనీసం ప్రజా ప్రాముఖ్యత ఉన్న సమస్యలపై చర్చించాలని పార్లమెంట్ ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు.



