Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ చేసిన సర్పంచ్, కార్యదర్శి

బస్వాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ చేసిన సర్పంచ్, కార్యదర్శి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో బుధవారం గ్రామంలోని ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాల కొరకు గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ, జిపి కార్యదర్శి భరద్వాజ్ తో కలిసి మార్కౌట్ వేసి  పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇంటి నిర్మాణాలను వేగవంతం చేసి మండలంలోని అత్యధికంగా గృహాలు నిర్మించిన గ్రామంగా తీర్చిదిద్దేందుకు తమ వంతుగా సహకరించాలని లబ్ధిదారులకు కోరారు.

ఇంటి నిర్మాణాల కొరకు బిల్లులు రాకపోతే తనని నేరుగా సంప్రదించాలని అధికారులతో మాట్లాడి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమాయే విధంగా కృషి చేస్తానని సర్పంచ్ రమణా అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ జిపి కార్యదర్శి జిపి పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు గృహ నిర్మాణ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -