నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గ్రామాల్లో త్రాగునీటి వాటర్ ట్యాంకులను తప్పని సరిగా క్లోరినేషన్ చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని నర్సాపూర్, దొమ్మరి చౌడు తండా, కోన సముందర్ గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గ్రామంలో కొనసాగుతున్న వాటర్ ట్యాంకుల క్లోరినేషన్, శానిటేషన్ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.
వేసవి కాలం దృష్ట్యా మండలంలో ఎక్కడ కూడా త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. శానిటేషన్ లో భాగంగా గ్రామాల్లో చెత్తాచెదారం శుభ్రం చేసి డ్రైనేజీల వెంట బ్లీచింగ్ పౌడర్ చల్లారని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



