నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని వడాయిగూడెం గ్రామ పరిధిలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను గ్రామ సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్ బుధవారం ఉదయం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కింద చేపట్టిన కందకాలు,చెరువు పూడికతీత పనులు నాణ్యతతో ఉండాలని అధికారులను,ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీల కోసం పని ప్రదేశంలో కచ్చితంగా నీడ సౌకర్యం (టెంట్), మంచినీటి వసతి కల్పించాలని సూచించారు.
పనికి సంబంధించిన వేతనాలు ఏ వారం ఆ వారం వారి ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని అధికారులకు విన్నవించారు. పని చేసే చోట ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,అందుబాటులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంచాలని కోరారు. గ్రామ అభివృద్ధిలో ఉపాధి హామీ కూలీల పాత్ర ఎంతో కీలకం. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే మా లక్ష్యం. కూలీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామనారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుక్కల శంకర్ యాదవ్, పంచాయితీ కార్యదర్శి కేతావత్ ఆమని, వార్డు సభ్యులు బబ్బూరి సబిత, పబ్బాల ఉమా, చుక్కల దుర్గయ్య యాదవ్, కోట దీప, కోట సుధావాణి, బబ్బూరి భరత్ గౌడ్,ఫీల్డ్ అసిస్టెంట్ బబ్బూరు శంకర్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.



