Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉర్దూ మీడియం విద్యార్థినికి ఘన సన్మానం

ఉర్దూ మీడియం విద్యార్థినికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పెద్దగుల్ల ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని ప్రతిభకు గుర్తింపుగా గ్రామ సర్పంచ్ మాదారావ్ దేశాయి, ప్రధాన ఉపాధ్యాయురాలు సబీనా బేగం లు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా బుధవారం గ్రామ సర్పంచ్ ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో మధ్యాహన భోజన పథకంలో మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉపాధ్యా యులు నేర్పిస్తున్న విద్య ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో మారుమూల మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెద్దగుల్ల గ్రామంలో ఉర్దూ మీడియం పాఠశాలను ఏర్పాటు చేశామని సర్పంచ్ తెలిపారు.

ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని అన్నారు. ఇటీవలే జనవరి నెలలో చివరి వారంలో మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో మండలంలోని అన్ని ఎంపీ యుపిఎస్ మరియు ఎంపీపీ ఎస్ ఉర్దూ మీడియం, తెలుగు మీడియం, టాలెంట్ టెస్టులు మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది. పెద్ద ఎడ్గిలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో పాల్గొన్న పెద్దగుల్లా గ్రామ ఉర్దూ మీడియం విద్యార్థిని తన ప్రతిభను చాటి పలు విభాగాలలో బహుమతులు, ప్రశంస పాత్రం జుక్కల్ ఎంఈఓ తిరుపతయ్య చేతుల మీదుగా అందించడం జరిగింది. ప్రతిభ చాటిన విద్యార్థికి శాలువాతో సన్మానించి జ్ఞాపకం అందించారు.

మండల కేంద్రం నుంచి వచ్చిన ప్రశంస పత్రాన్ని పెద్ద గుల్లా సర్పంచ్ మాదారావ్ దేశాయి చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సబీనా బేగం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , గ్రామ పెద్దలు , ఉర్దూ మీడియం హెచ్ఎం, ప్రతిభ చాటిన విద్యార్థిని తల్లిదండ్రులు  తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -