- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అమరావతిలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వెలగపూడి ఎన్-9 జంక్షన్ వద్ద ఎల్ అండ్ టీలో మంటలు వ్యాపించాయి. ప్లాస్టిక్ పైపులు దగ్ధమవ్వడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో దట్టంగా పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



