ఉన్నత పాఠశాలలో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు..!
నవతెలంగాణ – పెద్దవూర
తాము ఓనమాలు నేర్చుకున్న పాఠశాలకు ఎంతో కొంత సాయపడాలని అనుకుంటారు పూర్వ విద్యార్థులు. సొంత డబ్బుతో వసుతుల కల్పనలో భాగస్వాములు ఆవుతుంటారు. పెద్దవూర మండల కేంద్రం లోని జిల్లా ఉన్నత పాఠశాల 2000-2001పూర్వ విద్యార్థులుకోటఅంజి,చిరంజీవి,సైదులు,నాగయ్య,యాదగిరి వీరంతా కలిసి రూ.15 వేలతో పాఠశాలలో వాటర్ ఫిల్టర్ ను బుధవారం పెద్ద వూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాధానో పాధ్యాయులు, మండలం విద్యాధికారి తరి రాముకు అంద జేశారు.
ఈ సందర్బంగా పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ.. మేము అంతా కలిసి ఉన్నత పాఠశాలకు మరింత సేవా కార్యక్రమాలు అందిస్తామని వెల్లడించారు. గురువులను గౌరవించి వారు చూపిన బాటలో నడిచి, కష్టపడి చదివిఇంతటి స్థాయికి వచ్చామని తెలిపారు. అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ పెరిగిపోయిందని నేటి విద్యార్థులు టెక్నాలజీని మంచికి వినియోగించు కొని గురువులను గౌరవించి చదువులో రాణించాలని విద్యార్థులకు తెలిపారు.



