నవతెలంగాణ – మునుగోడు
చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న చేనేత కార్మికులు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మునుగోడు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న మండిపడ్డారు. బుధవారం ఆయన మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే చేతివృత్తుల కల నైపుణ్యతలో దేశానికే ఉన్న వన్నె తెచ్చిన చేనేత కార్మికులు తినేందుకు తిండి లేక , ఉండేటందుకు ఇల్లు లేక అవస్థలు పడుతూ దుర్భర స్థితిలో ఉన్న కొంతమంది చేనేత కార్మికులు పట్టణాలకు వలసబోయి అవస్థలు పడేవారు కొందరైతే చేతివృత్తినే నమ్ముకుని గ్రామాలలో జీవిస్తున్న ఎంతోమంది చేనేత కార్మికులు అర్ధాకలితో అలమటిస్తూ చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రభుత్వాలు చేనేత కార్మికులను ఆదుకో పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రం కోసం సిరిపురం అనేకమంది పద్మశాలీలు ఆత్మబలిదానాలు అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్రం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు పుట్టిన చేనేత కుటుంబంలోని బిడ్డలు అనారోగ్యాలతో కొట్టుమిట్టాడుతూ వైద్యానికి డబ్బులు లేక ప్రాణాలు వదులుతున్న చేనేత కార్మికులను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
చేనేత కార్మికులను ఆదుకునేందుకు గ్రామాలలో ఇల్లు లేని చేనేత కార్మికులను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులను ఆదుకునేందుకు రుణమాఫీ చేస్తానని చెప్పి సంవత్సరం గడుస్తున్న రుణమాఫీ చేయకుండా కాలయాపన చేయడంతో చేనేత కార్మికులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. చేనేత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున చేనేత కార్మికులతో పోరాటం చేస్తామని హెచ్చరించారు.



