Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధ్వంసమైన బీటీ రోడ్డుకు మరమ్మతులు

ధ్వంసమైన బీటీ రోడ్డుకు మరమ్మతులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాస కొత్తూర్ గ్రామం నుండి చౌట్ పల్లి గ్రామానికి వెళ్లే దారిలో గతంలో కురిసిన అధిక వర్షాల కారణంగా బీటీ రోడ్డు పలుచోట్ల పూర్తిగా ధ్వంసం అయింది. ఈ రోడ్డుపై రాకపోకలు సాధించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ  విషయమై హాసకొత్తుర్ గ్రామ సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి, బాల్కొండ నియోజక వర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి కలిసి విన్నవించారు.

ధ్వంసమైన  బీటీ రోడ్డు వద్ద తరచు  రోడ్డు ప్రమాదాలు జరగడంతోపాటు, ప్రజలకు ఇబ్బంది ఉన్న విషయం వివరించారు.వెంటనే స్పందించిన సునీల్ రెడ్డి అధికారులతో మాట్లాడి ధ్వంసమైన బిటి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. దీంతో ఆర్ అండ్ బి అధికారులు ధ్వంసమైన బిటి రోడ్డుకు డాంబర్ తో ప్యాచ్ లు వేశారు. వీటి రోడ్డు మరమ్మతులకు సహకరించిన సునీల్ రెడ్డికి సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -