- Advertisement -
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో బుధవారం శ్రావ్యాంజలి గ్రామ సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం లో భాగంగా విఏవో పన్నాల యమున ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు మెరుగు ఉమ మాట్లాడుతూ యమునా సేవలు అద్భుతమని, వివో ఏ పి ఆధ్వర్యంలో సంఘాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. మహిళా దినోత్సవం లో భాగంగా ఈరోజు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ ఘన సన్మానాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి బొజ్జలక్ష్మి, కోశాధికారి పోరిక శాంత సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



