Thursday, March 12, 2026
E-PAPER
Homeమానవిడీహైడ్రేషన్‌ నుంచి ఉపశమనం..

డీహైడ్రేషన్‌ నుంచి ఉపశమనం..

- Advertisement -

వేసవిలో చెమటలు బాగా పట్టి నీరసం వస్తుంది. త్వరగా అలిసిపోవడం, చికాకుగా అనిపిస్తుంది. దానికి కారణం శరీరం డీ హైడ్రేషన్‌కు గురికావడమే. ఈ సమస్యలకు సబ్జా గింజలు చక్కని పరిష్కారం చూపుతాయి. వీటిలో చాలా రకాల ప్రోటీన్లు ఉన్నాయి.

– సబ్జా గింజల్లో ఆల్ఫా-లినోలెనిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్‌ వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.
– సబ్జా గింజలను నిమ్మకాయ నీరు, షర్బత్‌, మిల్క్‌షేక్‌ల వంటి రిఫ్రెష్‌ డ్రింక్స్‌లలో వేసుకుని రోజుకు మూడు, నాలుగు గ్లాసులు తీసుకుంటే వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.
– ఈ గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి.
– రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.
– సబ్జా గింజల్లో ఐరన్‌, విటమిన్‌ కె, ప్రోటీన్‌ ఉన్నాయి. ఇవి పొడవాటి, జుట్టును బలంగా చేయడంలో తోడ్పడతాయి. ప్రోటీన్‌, ఐరన్‌ కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
– చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలు తగ్గుతాయి.
– తలనొప్పి, మైగ్రేన్‌ లాంటి సమస్యలు ఉన్నవారు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని తరుచూ తాగితే ఉపశమనం కలుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -