Thursday, March 12, 2026
E-PAPER
Homeసినిమా'డేవిడ్‌ రెడ్డి' కోసం..

‘డేవిడ్‌ రెడ్డి’ కోసం..

- Advertisement -

మంచు మనోజ్‌.. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను ఆయన ఆకట్టుకుంటుంటారు. తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో ఆయన చేసిన పోస్ట్‌ ఫ్యాన్స్‌ సహా ప్రేక్షకులను, సినీ వర్గాలను ఆకర్షిస్తున్నాయి. మనోజ్‌ తన ఫిట్‌నెస్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ గురించి ఓ అప్‌డేట్‌ను షేర్‌ చేసుకున్నారు. రాబోయే సినిమాల కోసం గత మూడు వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నానని ఆయన ఈ పోస్ట్‌లో వెల్లడించారు. అలాగే ఆయన పోస్ట్‌ చేసిన వర్కవుట్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ప్రస్తుతం మంచు మనోజ్‌ చేస్తోన్న ‘డేవిడ్‌ రెడ్డి’ మూవీ తన కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా రూపొందుతోంది. ఈ భారీ పాన్‌ ఇండియా పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాను హనుమ రెడ్డి యెక్కంటి తెరకెక్కిస్తున్నారు. నల్లగంగుల వెంకట్‌ రెడ్డి, భరత్‌ మోతుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1897 – 1920 మధ్య బ్రిటిష్‌ వలస పాలన కాలంలో జరిగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఇందులో చూపిస్తున్నారు. అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తోంది. పాన్‌ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను భారీ లెవల్లో నిర్మిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -