Thursday, March 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రత్యేక ఉర్దూ డీఎస్సీ నిర్వహించాలి

ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ నిర్వహించాలి

- Advertisement -

– ఎస్టీయూటీఎస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ నిర్వహించాలని ఎస్టీయూటీఎస్‌ కోరింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎస్టీయూ టీఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సదానందం గౌడ్‌, జుట్టు గజేందర్‌, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు యం.పర్వత్‌ రెడ్డిలు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్‌ అజహరుద్దీన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని వారు తెలిపారు. అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కువగా ఉండటంతో విద్యా బోధనకు ఆటంకం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇఫ్తార్‌ విందుకు మంత్రిని ఆహ్వానించారు. మంత్రి సమస్యపై సానుకూలంగా స్పందించారనీ, తగిన హామీ ఇచ్చారని వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -