Thursday, March 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగ్యాస్‌ కొరతకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం :ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌

గ్యాస్‌ కొరతకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం :ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌

- Advertisement -


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేశంలో గ్యాస్‌ కొరతకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని సివిల్‌ సప్లర్సు కమిషనరేట్‌ వద్ద ఆయన నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించి మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్‌తో అనుసరిస్తున్న దౌత్య విధానంతోనే చమురు దేశాలు మనకు ఇంధన సరఫరా నిలిపివేశాయని తెలిపారు. న్యూట్రల్‌ గా ఉన్న దేశాలకు ఇంధన సరఫరా చేస్తున్నాయనీ, ఆ దేశౄల్లో సమస్య తీవ్రత అంతగా లేదని ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం ముందుగా అంచనా వేయకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. యుద్ధ సంక్షోభం కొనసాగినా ఇబ్బంది లేదనీ, 74 రోజుల పాటు సరిపోయే నిల్వలు ఉన్నాయని ప్రగాల్భాలు పలికిన కేంద్రం ఇప్పుడు మాట మార్చడం దుర్మార్గమన్నారు. దేశంలో గ్యాస్‌ నిల్వలు లేవనీ, కమర్షియల్‌ సరఫరా నిలిపివేసి, డొమెస్టిక్‌ సప్లయి మాత్రమే కొనసాగించాలని ఉత్త్వరులు జారీ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదన్నారు. గ్యాస్‌ కొరత విషయంలో కేంద్రం రాష్ట్రాలను గందరగోళానికి గురి చేస్తోందన్నారు. కేంద్రం అప్రమత్తంగా వ్యవహరించకపోతే డొమెస్టిక్‌ వినియోగదారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. లాక్‌ డౌన్‌, కరోనా లాంటి సమయంలో హోటల్‌ ఇండిస్టీనే ఎకానమీని కాపాడిందని గుర్తుచేశారు. ఇప్పుడు గ్యాస్‌ కొరతతో హోటల్స్‌, హాస్టల్స్‌తో పాటు అనుబంధంగా ఉన్న ఎన్నో పరిశ్రమలు సంక్షోభానికి గురి అయ్యే ప్రమాదం ఉందని వాపోయారు. ఇప్పటికైనా కేంద్రం అప్రమత్తంగా వ్యవహరించి గ్యాస్‌ కొరత సమస్యను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -