Thursday, March 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ ఉద్యోగుల హెల్త్‌కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయండి

ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్‌కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయండి

- Advertisement -

– మంత్రి దామోదర రాజనర్సింహ్మకు టీడబ్ల్యూజేఎఫ్‌ వినతి
ననవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన ‘తెలంగాణ ఎంప్లాయిస్‌ హెల్త్‌ కేర్‌’ పథకాన్ని జర్నలిస్టులకూ ు వర్తింపజేయాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్య్లూజేఎఫ్‌) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మకు టీడబ్ల్యూజేఎఫ్‌ ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగ రఘు, బి.రాజశేఖర్‌, రాష్ట్ర కార్యదర్శులు ఈ చంద్రశేఖర్‌, బి.జగదీశ్వర్‌తో కూడిన ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించారు. గతంలో మాదిరిగానే జర్నలిస్టులకు కూడా ఉద్యోగుల పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మెడిక్లెయిమ్‌ పథకం తరహాలో హెల్త్‌ కార్డుల పథకానికి ప్రభుత్వమే కంట్రిబ్యూట్‌ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్కింగ్‌ జర్నలిస్టులకు న్యాయం చేయాలన్నారు. రిటైరైన జర్నలిస్టులనూ ఈ పథకం కింద చేర్చాలని కోరారు. గతంలో జర్నలిస్టుల జేహెచ్‌ఎస్‌ కింద జారీ చేసిన హెల్త్‌కార్డులు సక్రమంగా పని చేయడం లేదని తెలిపారు. ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో బిల్లుల పెండింగ్‌ పేరిట వైద్యచికిత్సలను అందించండం లేదని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ వ్యవస్థ కింద ఉన్న నేపథ్యంలో సేవలు వేగంగా, నాణ్యంగా అందడం లేదని తెలిపారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ కూడా చికిత్స పూర్తి ఉచితంగా అందడం లేదని వివరించారు. చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న జర్నలిస్టులు, అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి వైద్య చికిత్స చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -