– పలు అంశాలపై చర్చ
– ఐక్యంగా ముందుకుపోవాలని నిర్ణయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆహ్వానం మేరకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూయూ), తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) పాల్గొన్నాయి. ఆర్టీసీలోని తాజా స్థితిగతులు, కార్మికుల సమస్యలపైనా ఈ మూడు సంఘాలు కూలంకషంగా చర్చించాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరానికి సమైక్య పోరాటం అవసరం ఉందనీ, రాబోయే కాలంలో కార్మికుల సమస్యలను పరిష్కరించటానికి మిగిలిన సంఘాలు కూడా ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చాయి. ఈ సమావేశంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ (సీఐటీయూ) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వి. ఎస్. రావు, నాయకులు పి రవీందర్‌రెడ్డి ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశం, ఉప ప్రధాన కార్యదర్శి అబ్రహాం , నాయకులు అక్బర్ , టీజేఎంయూ ఉపాధ్యక్షులు గోలి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మూడు సంఘాల భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



