Thursday, March 12, 2026
E-PAPER
Homeజాతీయం108మంది మావోయిస్టుల లొంగుబాటు

108మంది మావోయిస్టుల లొంగుబాటు

- Advertisement -

రాయ్‌పూర్‌ : 108మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిపై రూ.3.95 కోట్ల రివార్డు ఉందని ఛత్తీస్‌గఢ్‌ అధికారులు బుధవారం తెలిపారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్‌ కమాండర్లు ఉన్నారని, ఒక్కొక్కరిపై ఎనిమిది లక్షల వరకు రివార్డు ఉందని పేర్కొన్నారు. వారి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దంతెవాడ నుండి 30మంది, సుక్మాలో 18మంది, బస్తర్‌లో 16మంది, నారాయణపూర్‌లో నలుగురు, కాంకెర్లోలో ముగ్గురు లొంగిపోయారని, వీరంతా దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీకి చెందిన వారని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -