- Advertisement -
– చెన్నైలో పెట్రోల్‌బంకుల వద్ద ఆటోల క్యూ
చెన్నై : పశ్చిమాసియాలో సంక్షోభం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌పీజీ కొరత, ధరల పెరుగుదల నేపథ్యంలో చెన్నైలోని ఆటోవాలాలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. అంబత్తూర్‌లోని ఓ బంకులో ఎల్‌పీజీ ఫిల్లింగ్ కోసం వందకు పైగా ఆటోలు బారులు తీరాయి. దీంతో స్థానికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
- Advertisement -



