- Advertisement -
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మేధాపాట్కర్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్‌కు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను తొందరపడి విడుదల చేయొద్దంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈమేరకు బుధవారం సీఎంకు ఆమె లేఖ రాశారు. మూసీ ఉద్యమ కార్యకర్తలు, ప్రభావిత వర్గాలతో ప్రజాస్వామ్యయుతంగా సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ చట్టం-2013లో చేసిన అన్యాయమైన సవరణలను రద్దు చేయాలని పేర్కొన్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజల దృష్టికోణంతో ప్రాజెక్టును సమగ్రంగా సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
- Advertisement -



