మిర్యాలగూడలో మూడోరోజు నాటకాల ప్రదర్శన
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మూడ్రోజులుగా సాంస్కృతిక కళాకేంద్రం నిర్వహిస్తున్న పద్య, సాంఘిక నాటకాలు ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి. బుధవారం మూడో రోజు ప్రముఖ పారిశ్రమికవేత్త రంగా రవి, రంగా శ్రీధర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పద్యనాటిక, సాంఘిక నాటికలకు మిర్యాలగూడకు పేరు ప్రతిష్టలు అందిస్తున్న తడకమళ్ల రామచంద్రరావు, పులి కృష్ణమూర్తి శర్మ వంటి పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. వారి కృషి అభినందనీయమన్నారు.
అనంతరం నటీనటులకు, నిర్వాహకులకు పారితోషకంతోపాటు షీల్డ్, ప్రశంసాపత్రాలను అందజేశారు. ‘త్యాగశీలి దధీచి మహర్షి’ పద్య నాటకం, ‘భక్త ప్రహ్లాద’ పద్య నాటిక, ‘ఉరి” సాంఘిక నాటిక, ‘వేదాంతం’ సాంఘిక నాటిక, ‘తితీక్ష’ సాంఘిక నాటకాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తడకమళ్ల రామచంద్రరావు, అధ్యక్షులు రామావతారం, ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, కోశాధికారి వెంకట లక్ష్మీ నారాయణ శర్మ, సాయిలు, సత్యనారాయణ చారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్య నారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శ్రీమతి శైలజ, సరస్వతి, నాగమణి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, టంగుటూరి రాజారాం పాల్గొన్నారు.
కనువిందుగా పద్య, సాంఘిక నాటకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



