Friday, March 13, 2026
E-PAPER
Homeసినిమా'యూత్‌'ఫుల్‌ ఎంటర్‌టైనర్‌

‘యూత్‌’ఫుల్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

కెన్‌ కరునాస్‌, అనిష్మ అనిల్‌ కుమార్‌, దేవదర్శిని చేతన్‌, సూరజ్‌ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్‌, మీనాక్షి దినేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ ‘యూత్‌’. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్‌ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్‌ ఫుల్‌ వినీత్‌, సందీప్‌. ఈ చిత్రానికి కెన్‌ కరునాస్‌ అండ్‌ గ్యాంగ్‌ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ మూవీ తెలుగులో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రానుంది. గురువారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను హీరో కిరణ్‌ అబ్బవరం లాంచ్‌ చేశారు.

ఈ మూవీని తెలుగులోకి తీసుకొస్తున్న వినీత్‌, సందీప్‌ చాలాకాలంగా కిరణ్‌ అబ్బవరంతో ట్రావెల్‌ చేస్తున్నారు. వారికి సపోర్ట్‌గా నిలుస్తూ ఆయన ఈ మూవీని ప్రమోట్‌ చేస్తున్నారు. ”యూత్‌” ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చూస్తుంటే మంచి యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌లా అనిపిస్తోంది. ఈచిత్రానికి స్క్రిప్ట్‌, డైరెక్షన్‌ – కెన్‌ కరునాస్‌ అండ్‌ గ్యాంగ్‌, ప్రొడ్యూసర్‌ – కరుపయ్య సి.రామ్‌, సులోచన కుమార్‌, మ్యూజిక్‌ – జీవీ ప్రకాష్‌ కుమార్‌, సినిమాటోగ్రఫీ – వికి, ఎడిటర్‌ – నాష్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ – రాము తంగరాజ్‌, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ – విజయ్ ఎంపీ, స్టంట్‌ – కలై కింగ్సన్‌, కొరియోగ్రఫీ – శోభి పాల్‌ రాజ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -