Friday, March 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'డెకాయిట్‌'.. కొత్త జోనర్‌లో చేసిన ప్రయోగం

‘డెకాయిట్‌’.. కొత్త జోనర్‌లో చేసిన ప్రయోగం

- Advertisement -

హీరో అడివి శేష్‌ తాజాగా డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తుండగా, అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్‌ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పిస్తోంది. ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. హీరో అడివి శేష్‌ మాట్లాడుతూ,’ఒక కొత్త జోనర్‌లో చేసిన సినిమా. ఇప్పుడు లవ్‌ స్టోరీనే యూనిక్‌. ఇది థ్రిల్లింగ్‌ యాక్షన్‌లో చెప్పిన లవ్‌ స్టోరీ. ఒక కొత్త జోనర్లో చేసిన ప్రయోగం.

ఈ సినిమా అందరినీ ఎగ్జైట్‌ చేేస్తుంది. సినిమా చివరకు వచ్చేసరికి అందరూ ఎమోషన్‌ అవుతారు. ఈ సినిమాలో ఎమోషన్‌ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమా మీరు ఫ్యామిలీస్‌తో కలిసి చూడొచ్చు. ఇందులో కన్నె పిట్టరో సాంగ్‌ పెట్టేలానే ఐడియా సుప్రియది. అది అద్భుతంగా వర్క్‌ అవుట్‌ అయ్యింది’ అని అన్నారు. ‘డైరెక్టర్‌కి ఇది ఫస్ట్‌ ఫిలిం, అనురాగ్‌ ఫస్ట్‌ తెలుగులో నటిస్తున్న సినిమా, శేష్‌ చేస్తున్న ఫస్ట్‌ లవ్‌ స్టోరీ ఇది. ఈ జర్నీలో సపోర్ట్‌ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని ప్రొడ్యూసర్‌ సుప్రియ యార్లగడ్డ చెప్పారు. డైరెక్టర్‌ షానియల్‌ డియో మాట్లాడుతూ, ‘ఈ సినిమా మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్‌ ఇస్తుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -