Friday, March 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'అల్లు సినిమాస్‌'ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

‘అల్లు సినిమాస్‌’ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

కోకాపేటలోని ‘అల్లు సినిమాస్‌’ మల్టీప్లెక్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద మల్టీప్లెక్స్‌ కావడం విశేషం. ఈ సందర్భంగా ‘అల్లు సినిమాస్‌’ లోని ఏర్పాట్లను అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ సీఎంకు వివరించారు. అనంతరం డాల్బీ స్క్రీన్‌లో ప్రదర్శించిన పలు ప్రచార చిత్రాలను సీఎం వీక్షించారు. అల్లు సినిమాస్‌లో నాలుగు స్క్రీన్లు ఉండగా, స్క్రీన్‌1లో డాల్బీ విజన్‌ సౌలభ్యం ఉంది. ఉగాది పండగ సందర్భంగా ఈ మల్టీప్లెక్స్‌లో సినిమాల ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘దేశంలో సినిమాకు గొప్ప పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న అల్లు కుటుంబాన్ని అభినందిస్తున్నాను.

సాంకేతికంగా సినిమా అత్యంత వేగంగా ముందుకు వెళ్తోంది. ‘బహుబలి, కల్కి, అరుంధతి, ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లాంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక విలువలతో వచ్చాయి. సినిమా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. సినిమాను పరిశ్రమగా గుర్తించి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఐటీ, ఫార్మాతో పాటు సినిమా పరిశ్రమను గొప్ప స్థాయికి తీసుకు వెళ్తాం. తెలుగు సినిమాకు కోలీవుడ్‌, శాండిల్‌ వుడ్‌, బాలీవుడ్‌ పోటీ కాదు. హాలీవుడ్‌ సినిమాలు ఇక్కడ చిత్రీకరించాలి. మన సినిమాలు హాలీవుడ్‌కి వెళ్ళాలి. కృష్ణానగర్‌ నుంచి గొప్ప సినిమాలు తీసే అనేక మంది సాంకేతిక నిపుణులు, కళాకారులు వస్తున్నారు. సినిమా పరిశ్రమ పెరగడానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -