Friday, March 13, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యార్థులకు సీఎం పినరయి విజయన్‌ లేఖ

విద్యార్థులకు సీఎం పినరయి విజయన్‌ లేఖ

- Advertisement -

‘అందమైన వాతావరణంలో చదువుకుందాం, ఆడుకుందాం..’ అంటూ సమాధాన లేఖ

కల్పేట: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నుంచి కల్పేట ప్రభుత్వ ఎల్పీ పాఠశాల విద్యార్థులకు అందిన సమాధాన లేఖ ఆనందాన్ని నింపింది. కొత్త పాఠశాల అందమైన వాతావరణంలో చదువుకోవడానికి, ఆడుకోవడానికి వీలు కల్పిస్తుందని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. ముండకై విపత్తు బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త టౌన్‌షిప్‌లో పాఠశాలను మార్చుతామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో విద్యార్థులు ఆయనకు కతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. దీనికి ప్రతిగా ముఖ్యమంత్రి సమాధాన లేఖ పంపారు. ప్రస్తుతం పరిమిత సౌకర్యాలతో పనిచేస్తున్న కల్పేట ప్రభుత్వ ఎల్పీ పాఠశాలను కొత్త టౌన్‌షిప్‌కు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

టౌన్‌షిప్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పాఠశాలకు భూమి కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. విద్యార్థుల లేఖకు స్పందిస్తూ సీఎం ”ముండకై మరియు చూరాల్మల ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను మేము అర్థం చేసుకున్నాం. విపత్తుతో దెబ్బతిన్న జీవితాలను పునర్నిర్మించడానికి ప్రభుత్వం కషి చేస్తోంది. అందులో భాగంగా కొత్త టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నాం. అక్కడ మీరు అందమైన వాతావరణంలో చదువుకుని, ఆడుకునే అవకాశం ఉంటుంది,” అని తన లేఖలో పేర్కొన్నారు. దాదాపు 50 మంది విద్యార్థులు కలిసి ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి. సీఎం సమాధాన లేఖ అందుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -