Friday, March 13, 2026
E-PAPER
Homeజాతీయంతెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: శుక్రవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 37°C గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గాలిలో తేమ 46% ఉండటంతో ఉక్కపోత ఎక్కువగా ఉండనుంది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 35°C నుండి 37°C మధ్య నమోదు కానున్నాయి. గాలిలో తేమ 19% మాత్రమే కాగా, రెండు రాష్ట్రాల్లో UV ఇండెక్స్ 9 గా నమోదు కానుందని వివరించింది. ఇది ప్రమాదకర స్థాయి అని వైద్యులు అంటున్నారు. దాహం వేయకపోయినా నీరు తాగాలని, మధ్యాహ్నం బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -