నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నెలకొన్న క్రమంలో ఒరిస్సాలో గ్యాస్ సిలిండర్ పేలుడు కలకలం రేపింది. ఒరిస్సాలో ఓ టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ పేలి.. పక్కనున్న షాపులకు మంటలు వ్యాపించడంతో భయబ్రాంతులకు గురయ్యారు జనం. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఒరిస్సాలోని అంగుల్ జిల్లాలోని బంతాల చౌక్ దగ్గరున్న ఓ టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ పేలుడు కలకలం రేపింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనున్న షాపులకు కూడా వ్యాపించడంతో భయబ్రాంతులకు గురయ్యారు జనం..
గ్యాస్ సిలిండర్ పేలిన టిఫిన్ సెంటర్ సహా కాంప్లెక్స్ లో ఉన్న చాలా షాపులు దెబ్బతిన్నాయి. పేలుడు జరిగిన కొద్దిసేపటికే షాపులో భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకుంది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే భారీగా మంటలు వ్యాపించడంతో మంటలు ఆర్పే సాహసం చేయలేకపోయామని చెబుతున్నారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలు పక్కన షాపులకు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేశారు ఫైర్ సిబ్బంది. ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు అధికారులు.



