Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వార్డు సభ్యుల శిక్షణా తరగతులకు 77 మంది హాజరు

వార్డు సభ్యుల శిక్షణా తరగతులకు 77 మంది హాజరు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని 11 గ్రామపంచాయతీలకు గాను మొదటి విడుదల వార్డు సభ్యుల శిక్షణ తరగతులకు శుక్రవారం 77 మంది హాజరైనారని ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రాము తెలిపారు. ఈ సందర్భంగా ట్రైనర్ గా నాగయ్య, అశోక్ గౌడ్ , దివాకర్ , నవీన్ పాడి సభ్యులకు పంచాయతీ రాజ్ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆవుగాహన కార్యక్రమంలో ట్రైనర్లు సభ్యులకు వివరిస్తూ గ్రామపంచాయతీలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, గ్రామపంచయతీలో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, జనన మరణల నమోదు పలు అంశాలపై వాడు సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ తరగతిలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము, ట్రైనర్లు నాగయ్య, అశోక్ గౌడ్, దివాకర్, నవీన్, మండల పరిషత్ సిబ్బంది, అధికారులు గంగాధర్, అనిల్ కుమార్, ప్రవీణ్, భూమా గౌడ్, ఆయా గ్రామాల కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -