నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో హోటళ్లు, స్వీట్ హోంలలో అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వినియోగం పై సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 5 అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్న స్వీట్ హోం, టిఫీన్ సెంటర్ల నుండి స్వాధీనం చేసుకుని సంబంధిత వారిపై కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లైస్ అధికారి కిష్టయ్య తెలిపారు. అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించిన వారికి జరిమానాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడకుండా ఉండేందుకు అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా హోటళ్లు, స్వీట్ హోంలలో అక్రమ డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న ఇప్పుడు కొరత ఏర్పడకుండా తనిఖీలు చేస్తున్నారని, ఈ తనిఖీలు ముందు నుండే చేపట్టి అక్రమ సిలెండర్లు నిర్వహించకుండా వ్యాపార సంస్థలకు హెచ్చరికలు జారి చేసి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.



