పాలడుగు వెంకటకృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన జజ్జరి రామక్క కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళల అండగా ఉండి ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని రంగాపూర్ గ్రామంలో జెజ్జరి రామక్క అనే వృద్ధ మహిళా అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ పరామర్శించి, వారికి రూ.3000 ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, ఆత్మ కమిటి పాలకవర్గ సభ్యులు రామచంద్రపు వెంకటేశ్వర రావు, సర్పంచ్ మోడెం సమ్మక్క, ఉపసర్పంచ్ బల్గురి శ్రీను, తోకల అహల్య, జెజ్జరి సౌజన్య, గడ్డం మంజుల, వట్టం నాగయ్య, గ్రామ అధ్యక్షులు వాసం రాము, రేగ కృష్ణారావు, భూక్య జగన్, వంక లక్ష్మీ నారాయణ, తుమ్మల శివ, మోడెం నారాజీ తదితర నాయకులు పాల్గొన్నారు.



