- Advertisement -
- జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్
నవతెలంగాణ – రాయికల్ - సెర్వికల్ క్యాన్సర్ నివారణకు ముందస్తు చర్యగా 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపు గల బాలికలకు హెచ్పీవీ టీకాలను తప్పనిసరిగా వేయించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. శనివారం రాయికల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న హెచ్పీవీ టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కోరుట్ల, మెట్ పల్లి,రాయికల్,ధర్మపురి,జగిత్యాల ప్రాంతాలతో పాటు జగిత్యాల మాతా శిశు ఆస్పత్రిలో హెచ్పీవీ టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హత గల బాలికలు తప్పనిసరిగా ఈ టీకాలు వేయించుకుని సెర్వికల్ క్యాన్సర్ నుంచి రక్షణ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



