Saturday, March 14, 2026
E-PAPER
Homeకరీంనగర్దావన్‌పల్లి పోచమ్మ ఆలయానికి రేకుల విరాళం

దావన్‌పల్లి పోచమ్మ ఆలయానికి రేకుల విరాళం

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
మండలంలోని దావన్‌పల్లి గ్రామంలో ఉన్న పోచమ్మ దేవాలయం ముందు నీడ లేకపోవడంతో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న దాతలు ఆలయానికి రేకులు విరాళంగా అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. రాయికల్‌కు చెందిన శ్రీ వెంకటేశ్వర దస్తావేజులేఖరి మాలవత్ వెంకటేష్, మరికొందరు దాతలు కలిసి పోచమ్మ దేవాలయం ముందు రేకులు ఏర్పాటు చేయడానికి అవసరమైన సామగ్రిని విరాళంగా అందించారు. వారి దాతృత్వాన్ని దావన్‌పల్లి గ్రామస్తులతో పాటు గ్రామ సర్పంచ్ మాలవత్ ప్రసాద్, వార్డు సభ్యులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -