నవతెలంగాణ – అశ్వారావుపేట
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేటలోని అమ్మ సేవా సదన్ (వృద్ధాశ్రమం)లో సేవా కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకురాలు ముయ్యబోయిన ఉమాదేవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా వాడవాడలా రెపరెపలాడేలా కృషి చేస్తామని అన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు వేముల కార్తీక్ నాయకత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. సభ్యత్వ లక్ష్య సాధనకు తమవంతు సహకారం పూర్తిగా అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుమ్మల పోసి, రామకృష్ణ, పమిడి ప్రసాద్, భాను తదితరులు పాల్గొన్నారు.


