- Advertisement -
నవతెలంగాణ- తుంగతుర్తి
తుంగతుర్తి మండల కేంద్రంలో శనివారం పదవ తరగతి మొదటి పరీక్ష(తెలుగు) ప్రశాంతంగా ముగిసిందని మండల విద్యాధికారి బోయిని లింగయ్య అన్నారు. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం మండల కేంద్రంలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 189 మంది విద్యార్థులు, మేరీ మదర్ పాఠశాలలో 172 మంది విద్యార్థులు, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల యందు190 మంది విద్యార్థులకు గాను 189 మంది విద్యార్థులు హాజరైనట్లు, మొత్తం మూడు సెంటర్లలో కలిపి 551 మంది విద్యార్థులకు గాను 550 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్ సలీం షరీఫ్ సందర్శించడం జరిగిందని మండల విద్యాధికారి తెలిపారు.
- Advertisement -



