నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో నాలుగు పరీక్షా కేంద్రాలలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 14న ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు జరగనున్నాయి. తొలి రోజు తెలుగు పరీక్ష విజయవంతంగా ముగిసినట్లు మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య తెలిపారు. మండలంలోని 4 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. మొత్తం 478 మంది విద్యార్థులకు 475 మంది విద్యార్థులు హాజరయ్యారని,3 సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు పరీక్షకు మినహాయింపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మున్ముందు జరగబోయే పరీక్షలకు విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. తొలిరోజు పరీక్షకు విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశారు.
ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



